***దక్షిణామూర్తి***
పరమ శివుడు మర్రిచెట్టు కింద యోగముద్రలో దక్షిణ ముఖముగా కుడి మోకాలు మీద ఎడమ కాలును ఉంచి నాలుగు చేతులతో నవ్వుతు శరీరం అంత బూడిద పూసుకుని , వస్త్రముగా పులిచర్మాన్ని ధరించి అమోఘమైన తేజస్సుతో ఆశీనుడై ఉన్నవాడే దక్షిణామూర్తి. ఈయన గూర్చి నన్ను అడిగితే ఎంత చెప్పిన తక్కువే అంటాను. గురువులకు గురువు, మేధోసంపత్తి కి అధిపతి, ఈయనను ఏకాగ్రతో చూస్తూ ఉంటే చాలు ఎన్నో తెలియని విషయాలను ని మస్తిష్కం నకు చొప్పించగలవాడు. దక్షిణామూర్తిని ఆరాధించటం వలన సమస్త గ్రహ దోషాలు తొలగును. స్వామి దక్షిణామూర్తి అని అంటే చాలు ని సమస్త దరిద్రాలు నీకు ఉన్న చెడు అలవాట్లు అన్నింటిని తొలగిస్తాడు . మీ ఇంట్లో మితిమీరిన అల్లరితో పిల్లలు అల్లరి చేస్తున్నారా అయితే దక్షిణామూర్తి పటమును ఉత్తరం గోడకు దక్షిణముఖముగా పెట్టండి మితిమీరిన అల్లరితో ఉన్న పిల్లలకు అల్లరిని తగ్గించి చదువుపై శ్రద్ధను పెంచుతాడు. దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించండి ముక్తిని పొందండి.
*దక్షిణామూర్తి మంత్రం*
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేదాం ప్రగ్యామ్ ప్రయచ్ఛ స్వాహా .
బ్రహ్మశ్రీ పెనుమత్స భద్ర M.Sc.,M.Sc., M.Sc., ML.ISc., M.Phil., D.P.H., PGDJV., SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
All right reserved @ copyright protection under the Copyright Act.
————————————————————————————————————————————–
Add comment