పిత్తాశయం అంటే ఏమిటి?
పిత్తాశయం Cholelithiasis అనేది కాలేయం క్రింద ఉండే చిన్న పియర్ ఆకారపు సంచిలాంటిది. ఇది కాలేయం ఉత్పత్తి చేసే పిత్తరసాన్ని నిల్వచేసి, జీర్ణక్రియలో అవసరమైనప్పుడు చిన్న ప్రేగులలోకి విడుదల చేస్తుంది. పిత్తరసం ముఖ్యంగా కొవ్వులను జీర్ణించడంలో సహాయపడుతుంది.

పిత్తాశయ రాళ్లు ఎలా ఏర్పడతాయి?
పిత్తరసంలో కొలెస్ట్రాల్, బిలిరుబిన్ లేదా పిత్తలవణాల సమతుల్యత చలించిపోయినప్పుడు, అవి గట్టిగా మారి రాళ్ళు ఏర్పడతాయి. ఇది సాధారణంగా ఈ క్రింది పరిస్థితుల వలన జరుగుతుంది:
- అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు
- అధిక బిలిరుబిన్ ఉత్పత్తి
- పిత్తాశయం సరిగ్గా ఖాళీ కాకపోవడం
రకాల గాల్ బ్లాడర్ స్టోన్స్
- కొలెస్ట్రాల్ రాళ్లు – ఇవి పసుపు రంగులో ఉండి కొలెస్ట్రాల్‌తో తయారవుతాయి.
- పిగ్మెంట్ రాళ్లు – ఇవి ముదురు రంగులో ఉండి బిలిరుబిన్తో ఏర్పడతాయి.
పిత్తాశయ రాళ్లకు ప్రమాదకరమైన అంశాలు
- మహిళలు (గర్భధారణ సమయంలో)
- 40 ఏళ్ళు దాటిన వారు
- అధిక బరువు ఉన్నవారు
- త్వరితగతిన బరువు తగ్గే వారు
- మధుమేహం ఉన్నవారు
- అధిక కొవ్వు మరియు తక్కువ ఫైబర్ ఆహారం తీసుకునేవారు
- వారసత్వంగా వచ్చే లక్షణాలు
ముఖ్యమైన లక్షణాలు
- కడుపు పైభాగంలో నొప్పి
- భోజనం తర్వాత వాంతులు, వికారం
- పొట్టలో ఒత్తిడి, ఉబ్బటం
- కొవ్వు పదార్థాలు తిన్న తర్వాత అసౌకర్యం
- తీవ్రమైన గాల్ బ్లాడర్ ఎటాక్ (గంటల తరబడి నొప్పి)
- జ్వరం, చలి
- చర్మం పసుపు రంగు కావడం
పరీక్షలు మరియు నిర్ధారణ
- అల్ట్రాసౌండ్ స్కాన్
- CT స్కాన్ లేదా MRI
- రక్తపరీక్షలు
- HIDA స్కాన్
- ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్

చికిత్స మార్గాలు
1. చికిత్స అవసరం లేని పరిస్థితులు
- రాళ్లు చిన్నవిగా ఉండి ఎటువంటి లక్షణాలు చూపించకపోతే వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం సరిపోతుంది.
2. ఔషధాలు
- కొలెస్ట్రాల్ రాళ్లను కరిగించడానికి ప్రత్యేక మందులు ఉపయోగిస్తారు. అయితే ఇది చాలా కాలం పడుతుంది.
3. శస్త్రచికిత్స (Cholecystectomy)
- గాల్ బ్లాడర్‌ను పూర్తిగా తీసేయడం. ఇది రెండు రకాలుగా జరుగుతుంది:
- లాపారోస్కోపిక్ శస్త్రచికిత్స
- ఓపెన్ సర్జరీ
4. ERCP పద్ధతి
- ఎండోస్కోప్ ద్వారా గాల్ బ్లాడర్ నుంచి రాళ్లను తీసివేయడం.
గాల్ బ్లాడర్ తొలగింపు తర్వాత జీవన శైలి మార్పులు
- కొంతకాలం కొవ్వు పదార్థాల జీర్ణక్రియలో సమస్యలు
- సాధారణంగా చిన్నపాటి జీవన శైలి మార్పులతో సాధారణ జీవితం కొనసాగించవచ్చు
- తక్కువ కొవ్వుతో కూడిన ఆహారం, ఎక్కువగా ఫైబర్ తీసుకోవాలి
నివారణ మార్గాలు
- ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ
- త్వరితంగా బరువు తగ్గకూడదు
- కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి
- ఎక్కువగా ఫలాలు, కూరగాయలు, ధాన్యాలు తినాలి
- రోజూ వ్యాయామం చేయాలి
- రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి

Add comment