టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని నంద్యాల పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాల ప్రకారం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు పెట్టారు.
ఎన్నికల సమయంలో సెక్షన్ 144 అమలులో ఉండగా, అనుమతి లేకుండా అల్లు అర్జున్ జన సమీకరణ జరిపారనే కారణంతో కేసు నమోదు చేశారు. దీనిపై, తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఈరోజు తుది తీర్పు ఇచ్చింది.
ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తుండగా, అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ తరపున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవి ఇంటికి వెళ్లారు. అప్పుడు బన్నీని చూడటానికి వేలాదిమంది అభిమానులు అక్కడ చేరుకున్నారు. ఈ సంఘటనతో, నంద్యాల పోలీసులు బన్నీతో పాటు శిల్పా రవిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.
Add comment